ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్కంఠభరితంగా సాగిన అక్షయ్ కుమార్ "రామ్ సేతు" గ్లిమ్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 01:31 PM

కొంచెంసేపటి క్రితమే అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న "రామ్ సేతు" టీజర్ విడుదలయ్యింది. అశోకవనంలో ఉన్న సీత జాడ కనుగొనేందుకు శ్రీరాముడు ఏర్పాటు చేసిన బ్రిడ్జి (వంతెన) గా అభివర్ణింపబడే ఈ కట్టడం అసలు నిజంగా ఉందా లేదా అని ఆర్కియోలజిస్ట్ పాత్ర పోషిస్తున్న అక్షయ్ కుమార్ అండ్ టీం చేసే యాక్షన్ అడ్వెంచరస్ ఈ సినిమా. ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై విపరీత ఆసక్తిని రేకెత్తిస్తుంది.
అక్షయ్ కుమార్ తో పాటు ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సత్యదేవ్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుశ్రత్ బరుచ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
అభిషేక్ శర్మ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com