హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్, అతని భార్య జెన్నిఫర్ ఫ్లావిన్ విడాకుల నిర్ణయంపై వెనక్కి తగ్గారు. విడాకుల కోసం దాఖలు చేసిన ఒక నెల తర్వాత రాజీ పడ్డారు. వారు ఇటీవల కలుసుకుని విభేదాలపై మాట్లాడుకున్నారని వారి ప్రతినిధి తాజాగా పేర్కొన్నారు. ఈ దంపతులకు వివాహమై 25 ఏళ్లు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల విభేదాలు తలెత్తడంతో విడాకుల వరకు వెళ్లారు.