ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా రివ్యూ: 'మాచర్ల నియోజకవర్గం'

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 12, 2022, 03:25 PM

30 ఏళ్లుగా ఎన్నికలు జరగని మాచర్లలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్(నితిన్) ఏం చేశాడనేదే ఈ సినిమా. నితిన్ యాక్టింగ్, సముద్రఖని విలనిజం, ఫైట్స్ బాగున్నాయి. రొటీన్ కథ, ప్రేక్షకుడి ఊహకు తగ్గట్లుగా సాగే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. హీరోయిన్లకు కథలో ప్రాధాన్యం లేదు. 2 పాటలు బాగున్నాయి. డైరెక్టర్ రొటీన్ కథను ఎంచుకుని రొటీన్ గానే తీశాడు. కెమెరా వర్క్ బాగుంది. 


కథ : ‘మాచర్ల నియోజకవర్గం’లో రాజప్ప (సముద్రఖని) తనకు ఎవరు ఎదురు రాకుండా అడ్డు వచ్చిన వాడిని చంపుకుంటూ ఎలక్షన్సే లేకుండా గెలుస్తూ ఉంటాడు. మరోపక్క సిద్దార్థ్ రెడ్డి (నితిన్) సివిల్స్ టాపర్. పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో స్వాతి (కృతి శెట్టి)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే.. మాచర్ల నియోజకవర్గం’ రాజప్ప మనుషులు స్వాతిని చంపడానికి ట్రై చేస్తారు. అసలు రాజప్ప కి స్వాతికి మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి ?, ఆ తర్వాత గుంటూరు జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన సిద్దార్థ్ రెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఎలా జరిపించాడు ?, ఫలితంగా జరిగిన కొన్ని నాటకీయ పరిణాలు ఏమిటి ? చివరకు సిద్దార్థ్ రెడ్డి మాచర్ల నియోజకవర్గం’లో పరిస్థితులు మార్చాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.


ప్లస్ పాయింట్స్ : నితిన్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం పక్కా పొలిటికల్ డ్రామాగా సాగడం వల్ల నితిన్ నుంచి వచ్చిన డిఫరెంట్ సినిమాగా ఈ సినిమా నిలుస్తోంది. ఇక నితిన్ కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కీలక పాత్రలో నటించిన హీరోయిన్ కృతి శెట్టి కూడా చాలా బాగా నటించింది. కథలో ఆమె పాత్రను ఇన్ వాల్వ్ చేయడం బాగుంది. మరో హీరోయిన్ కేథరిన్ పాత్ర కేవలం సపోర్టింగ్ రోల్ కే పరిమితమైంది. కానీ ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది. విలన్ గా ప్రధాన పాత్రలో కనిపించిన సముద్రఖని తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించిన రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. అలాగే కొన్ని డైలాగ్స్, అండ్ కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి.


మైనస్ పాయింట్స్ : దర్శకుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాలకు సంబంధించి మంచి డ్రామా తీసుకున్నా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేకపోయారు. ఆయన రాసుకున్న సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా బోర్ గా సాగాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, ఓన్లీ పొలిటికల్ డ్రామానే ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువ ఆసక్తి చూపించాడు. అదే విధంగా సముద్రఖని పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా బలంగా ఉంటే బాగుండేది. సినిమాలో ఉన్న బలమైన కాన్ ఫ్లిక్ట్ ఎలివేట్ చేయడంలో విఫలం అయ్యారు. అలాగే కొన్ని చోట్ల ప్లే స్లో అయింది. దీనికి తోడు ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితులకు ఈ సినిమాలో ప్రస్తావించిన రాజకీయ అంశాలకు మధ్య ఎక్కడా పొంతన లేదు. దాంతో ఈ సినిమాలో ప్రేక్షకులు మెయిన్ పాయింట్ కి అస్సలు కనెక్ట్ కారు. అలాగే లవ్ స్టోరీ కూడా బోరింగ్ గా సాగింది.
రేటింగ్ : 2.5/5. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com