సౌత్ సినిమాలు నార్త్ లో వందల కోట్లు వసూలు చేస్తుంటే, హిందీ సినిమాలు కనీసం నార్త్ లో బ్రేక్ ఈవెన్ సాధించలేక ఉసూరుమంటున్నాయి. ఈ సంవత్సరంలో హిందీలో విడుదలైన గంగూభాయ్ కతియావాడి, ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలు తప్పితే మిగిలిన ఏ సినిమాలు కూడా కనీసం బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయాయి. వీటిల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉండటం విశేషం. అక్షయ్ బచ్చన్ పాండే, టైగర్ ష్రాఫ్ హీరో పంటి, షాహిద్ కపూర్ జెర్సీ, రణ్ వీర్ సింగ్ జయేష్ భాయ్ జోర్దార్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక చతికిలపడ్డాయి.
కట్ చేస్తే, హిందీలో తాజాగా విడుదలైన భూల్ భులాయియా2 చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో బాలీవుడ్ పరువును నిలబెట్టింది. బాలీవుడ్ యువనటుడు కార్తీక్ ఆర్యన్, గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం 2007లో అక్షయ్ కుమార్ నటించిన భూల్ భులాయియా కి సీక్వెల్ గా తెరకెక్కింది. హార్రర్ కమ్ కామెడీ జోనర్ లో నడిచే ఈ చిత్రానికి బాలీవుడ్ జనాలు బాగానే కనెక్ట్ అయ్యారు.
మే 20న రిలీజ్ ఐన ఈ మూవీ ఏకధాటిగా నాలుగు వారాల పాటు థియేటర్లలో రన్ అయ్యి, రూ. 175 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. జూన్ 19వ తేదీ నుండి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీగా ఉంది.