ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ చిన్న సినిమా అల్లుఅరవింద్ నే మెప్పించిందిగా !

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 09:15 PM

టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధిపతిగా, అభిరుచి గల నిర్మాతగా ఇండస్ట్రీలో అల్లు అరవింద్ కు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన నిర్మాణ సారధ్యంలో ఎన్నో ఫీల్ గుడ్ మూవీస్, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయి. తాజాగా ఒక కుర్ర హీరో సినిమా ప్రివ్యూ చూసిన అరవింద్ కు ఆ సినిమా తెగ నచ్చేసిందట. దీంతో తమ సొంత సంస్థలోనే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిస్టిబ్యూట్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ...అల్లు అరవింద్ ను సైతం ఫిదా చేసిన ఆ సినిమా ఏంటి? హీరో ఎవరు? అని తెలుసుకోవాలనుంది కదా! ఆ సినిమానే కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 'సమ్మతమే'. 


సెబాస్టియన్ పీసీ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి రాబోతున్న సినిమా "సమ్మతమే". యువదర్శకుడు గోపినాధ్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్.  ఈ మూవీ నచ్చి డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుకున్నారట అల్లు అరవింద్. మరి ఈ చిన్న సినిమాకు అల్లు అరవింద్ లాంటి బడా ప్రొడ్యూసర్ ఇమేజ్ ఎంతవరకు సక్సెస్ నిస్తుందో చూడాలి. ఈ నెల 24న విడుదల కానున్న నేపథ్యంలో మూవీ ట్రైలర్ రేపు విడుదల చేయడానికి మూవీ టీం సన్నాహాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com