టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ పూరి "రొమాంటిక్" సినిమాతో తొలి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రొమాంటిక్ సక్సెస్ జోష్ ను తదుపరి సినిమాతో కూడా కంటిన్యూ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఆకాష్ పూరి తదుపరి దళం,జార్జ్ రెడ్డి వంటి చిత్రాలతో విమర్శకుల మన్ననలను పొందిన జీవన్ రెడ్డి డైరెక్షన్లో "చోర్ బజార్" అనే సినిమాను చేస్తున్నారు. ఇందులో గెహనా సిప్పి కధానాయిక. ఈ చిత్రాన్ని ఐవి ప్రొడక్షన్స్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవడానికి రెడీ ఐన చోర్ బజార్ ప్రస్తుతం ప్రమోషన్స్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో సినిమా నుండి 'బచ్చన్ సాబ్' అనే ఫ్యాన్ యాంథెం సాంగ్ ను లిరికల్ వెర్షన్ లో రిలీజ్ చేసారు. మాస్ రాజా రవితేజ చేతుల మీదుగా విడుదలైన ఈ పాట ఒక పెప్పి నెంబర్ గా శ్రోతలను అలరిస్తుంది. ఈ పాటలో చోర్ బజార్ మూవీ మెయిన్ ప్లాట్ ను, హీరో పాత్ర విధానాన్ని చూపించారు.