ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"కలర్ ఫోటో" మూవీ నుంచి 'తరగతి గది' పాట లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 02:17 PM

"కలర్ ఫోటో" మూవీ నుంచి 'తరగతి గది' పాట లిరిక్స్:
తొలి పలుకులతోనే కరిగిన మనసు.. చిరు చినుకుల లాగే జారే
గుసగుసలను వింటూ అలలుగ వయసు.. పదపదమని తీరం చేరే

ఏ పనీపాట లేని ఈ చల్ల గాలి
ఓ సగం చోటే కోరి మీ కథే విందా

ఊరూ పేరూ లేని ఊహా లోకానా
తారాతీరం దాటి సాగిందా ప్రేమా

తరగతి గది దాటి తరలిన కథకి
తెలియని తెగువేదో చేరే..
అడుగులు పడలేనీ తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే…… నేడే

రాణే గీత దాటే.. విధే మారే
తానే తోటమాలి దరే చేరే
వెలుగూ నీడల్లే కలిసే సాయంత్రం
రంగే లేకుండా సాగే చదరంగం

సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ
రాసారో లేదో ఆ దేవుడు గారు

తరగతి గది దాటి తరలిన కథకి
తెలియని తెగువేదో చేరే
అడుగులు పడలేనీ తొలి తపనలకి
ఇరువురి మొహమాటాలే దూరము పోయే






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com