యాక్ట్రెస్ ఎప్పుడూ ఫిట్ నెస్ గా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను దక్కించుకునేందుకు నాజుగ్గా కనిపించేందుకు జిమ్ లు, యోగా చేస్తూ గంటల తరబడి కష్టపడుతారు. జీరో ఫ్యాట్ బాడీని బిల్డ్ చేసేందుకు హెవీ వర్కట్సౌ చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తరుచూ కనిపిస్తూనే ఉంటాయి.తాజాగా జాన్వీ కపూర్ కూడా తన ఫిట్ నెస్ రహస్యాన్ని బయటపెట్టింది. ప్రతిరోజు యోగాసనాలు వేస్తూ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన పలు పిక్స్ ను తన అభిమానులతో తాజాగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుందీ బ్యూటీ.
అయితే ఈ పిక్స్ లో చాలా కఠినమైన యోగాసనంలో కూర్చున్న జాన్వీ కపూర్ నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. బాడీ స్ట్రెచింగ్ పోజులో ఆకట్టుకుంటోంది. అలాగే మరో పిక్ లో జాన్వీ వెయిట్ బ్యాలన్స్ చేస్తూ కనిపించింది. ఇలా ప్రతి రోజూ యోగా చేస్తుందని యోగాసనాలు వేయాల్సిందేనని చెబుతోంది జాన్వీ.