ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజును పురస్కరించుకుని శుక్రవారం హిందూపురంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఆవరణంలో బుల్లెట్లతో ఎన్టీఆర్ పేరు వచ్చేవిధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అభిమానులు కూడా ఎన్టీఆర్ ఆకారంలో నిలబడి ఆర్ఆర్ఆర్ సినిమాకు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాయకులు ప్రెస్ వెంకటేశ్, సుమోశీన మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్‌హిట్ అవుతుందని, చాలారోజుల తరువాత ఎన్టీఆర్ సినిమా రావడం ఆనందంగా ఉందన్నారు.