నాని ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాబోతున్న ‘వి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని.. ముఖ్యంగా నాని క్యారెక్టర్ కూడా ఎవరు ఊహించని విధంగా ఉంటుందని సినిమా పూర్తిగా కొత్తగా ఉండబోతుందట. అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్ అండ్ మిగిలిన నటీనటుల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.