ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ మూవీ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్...!

cinema |  Suryaa Desk  | Published : Tue, May 12, 2020, 11:39 AM

 పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తుండటంతో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది. పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. కాగా నేటితోటి ఈ సినిమా రిలీజ్ అయి ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. ఈ సందర్భంగా మెగా అభిమానులు ఈ సినిమా పోస్టర్స్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని ఈ సినిమాలో ఉంటాయనే నమ్మకం ఉంది. ఆ కారణంగా ఈ సినిమా పై ఫ్యాన్స్ బాగా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా నేడు గబ్బర్ సింగ్ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజు. మరి ఈ సినిమా గురించి హరీష్ శంకర్ ఏదైనా అప్ డేట్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com