ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తక్కవ సొమ్ముతో...ఎక్కవు మంది కూర్చునే కార్లు ఇవిగో

business |  Suryaa Desk  | Published : Sun, Jul 03, 2022, 10:35 PM

ఈ రోజుల్లో ప్రయాణం ఓ సాహసమే. కారణం కుటుంబం మొత్తం కలసి ప్రయాణించాల్సి వస్తే వారు రవాణా సదుపాయం అందరికి ఒకే చోట లభించడం కష్టతరంగా మారుతోంది. అందుకే చాలా మంది కార్లను ఆశ్రయిస్తుంటారు. ఈ నేపథ‌యంలోనే చిన్న కార్లతో పోలిస్తే దేశంలో పెద్ద కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ప్రజలు ప్రస్తుతం 7 సీటర్ లేదా ఎస్‌యూవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించడానికి వీలుగా ఉండటంతో పాటు.. లగేజ్ కోసం ఎక్కువ స్పేస్ అందుబాటులో ఉంటుండటంతో చాలా మంది ఈ కార్లను కొంటున్నారు. ఈ సదుపాయాలతో కూడిన కార్లు రూ.10 లక్షల కంటే తక్కువకే అందుబాటులోవుంటే ఎవరికైనా కొన్నాళ్లన్న ఆసక్తి ఉంటుంది. అలాంటి వారికోసమే ఈ సమాచారం.


కియా కారెన్స్..


కియా కారెన్స్ ధర రూ.8.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రూ.10 లక్షల లోపల ఈ వెహికిల్‌కు చెందిన ప్రీమియం, ప్రెస్టేజ్ పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ వెహికిల్‌ ఆరు లేదా ఏడు సీట్లతో అందుబాటులో ఉంటుంది. ఈ కారులో ప్రత్యేకంగా 10.25 అంగుళాల హెచ్‌డీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 64 కలర్ యాంబియెంట్ లైటింగ్, బోస్ సౌండ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫికేషన్, ముందు భాగాన వెంటిలేషన్, సన్‌రూఫ్‌ను అందించింది.


మారుతీ సుజుకి ఎర్టిగా..


ఈ 7 సీటర్ వెహికిల్.. పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఏడు వేరియంట్లలో ఈ కారును కంపెనీ లాంచ్ చేసింది. ఇక మైలేజ్ విషయానికి వస్తే.. 17 నుంచి 26 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.7.96 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు అప్‌డేటెడ్ వెర్షన్‌ను కంపెనీ త్వరలోనే లాంచ్ చేస్తుంది. సరికొత్త అధునాతన ఫీచర్లతో ఈ కారు మార్కెట్లోకి వస్తుంది.


రెనాల్ట్ ట్రైబర్..


రెనాల్ట్ ట్రైబర్ ధరను కంపెనీ రూ.6.43 లక్షలకు లాంచ్ చేసింది. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆలో, యాపిల్ కారుప్లేతో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ ఆడియో, కాలింగ్ కంట్రోల్స్, రెండు, మూడు వరుస సీట్లకు ఏసీని అడ్జెస్ట్ చేసుకునే అవకాశం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపడానికి, స్టార్ట్ చేయడానికి పుష్ బటన్ ఈ కారులో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com