తెలుగుదేశం పార్టీ సభ్వత్య నమోదు కార్యక్రమానికి విశేషమైన స్పందన లభిస్తోంది. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకోవటంతో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం భారీగా విరాళాలు అందజేస్తూ కార్యకర్తల అభ్యున్నతికి పాటుపడుతున్నారు. గుంటూరుకు చెందిన భాష్యం ప్రవీణ్ రూ. 10 లక్షలు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలానికి చెందిన కుర్రా అప్పారావు రూ. 5 లక్షలు, ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం కారంచేడుకు చెందిన యార్లగడ్డ కృష్ణ రూ. 5 లక్షలు, నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంకు చెందిన ఇంటూరి నాగేశ్వరావు రూ. 500116, తూగో జిల్లా అమలాపురంకు చెందిన వి.యస్ ఆర్ రావు రూ. 5,50,000 పార్టీకి విరాళాలు అందజేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం విరాళాలు ఇవ్వటం అభినందనీయం. పార్టీ అభ్యున్నతికి పాటుపడుతున్న వారిని, పార్టీ కోసం త్యాగాలు చేస్తున్నవారిని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుర్తించి గౌరవిస్తుంది. ఈ విరాళాలు కార్యకర్తల సంక్షేమం, వారి పిల్లల చదువులకు వినియోగించటం జరుగుతుంది
![]() |
![]() |