ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమితాబ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 16, 2017, 03:20 PM

కోల్‌కతా: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. బిగ్ బీ ప్రయాణిస్తున్న మెర్సిడీజ్ కారు వెనుక టైరు ఊడిపోయింది. గత శనివారం కోల్‌కతా పర్యటనకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలవకుండానే అమితాబ్ బయటపడ్డాడు. 23వ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రావాల్సిందిగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వమే అమితాబ్‌ను కోల్‌కతాకు ఆహ్వానించింది. దీంతో ఆ కారు ఏర్పాటు చేసిన సదరు ట్రావెల్ ఏజెన్సీకి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో అమితాబ్‌తోపాటు సీనియర్ మంత్రి కూడా ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే వెనుకాల వస్తున్న మంత్రి కారులో అమితాబ్‌ను ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ జరపగా.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు పూర్తయినా నడుస్తున్నట్లు తేలింది. సదరు ఏజెన్సీపై చర్యలు తీసుకోనున్నట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com