ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైజాగ్ కు 80 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 16, 2017, 03:30 PM

ఎండనక వాననక, పగలనక రాత్రనక ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కోతకొచ్చాయి. మరో వారంరోజుల్లో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కాబోతున్నాయి. సరిగ్గా ఈ దశలో వరుణుడు కన్నెర్రజేస్తున్నాడని రైతులు వాపోతున్నారు. విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైఉంది. దీంతో ఉత్తరకొస్తా తీరం వెంబడి తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉందని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని, ఒడిశా, ఉత్తరకొస్తా మధ్యలో తీరందాటే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోతకు రావడంతో వాణిజ్య పంటగా వేసిన పెసలు, మినుములు మొలుస్తాయా? అన్న ఆందోళనలో ఉన్నారు. వరుణుడి రాక రైతుకు ఆనందాన్నికలిగించినా, ఈ పరిస్థితుల్లో పిలవని చుట్టం వచ్చినట్టు బెంబేలెత్తిపోతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com