రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పేరిట అంతులేని భారం మోపుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ ఇప్పటికే వాత పెడుతుండగా.... మూలిగే నక్కపై తాడిపండు పడినట్లు ఇప్పుడు భూమార్పిడి కింద నాలా పన్నులు కట్టాలంటూ నోటీసులు జారీ చేయడం దారుణమంటున్నారు. ఎప్పుడో కొనుగోలు చేసిన భూములకు ఇప్పడు పన్నులేంటని ప్రశ్నిస్తున్నారు.