ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పత్తి రైతుకు విత్తన భారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 20, 2022, 09:31 AM

పత్తిసాగు చేసే రైతుపై విత్తనం కొనుగోలు భారం పడనుంది. ఇప్పటి వరకు బీజీ-2 450 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్‌ రూ. 710 వరకు ఉండేది. ఇప్పుడు ఆ ధర కాస్త రూ. 810కి చేరింది. ఈ మేరకు వ్యవసాయ కమిషనరేట్‌ నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. బీటీ-1 పత్తి విత్తన ప్యాకెట్టు ధర రూ. 635గా ఉంది. గతంలో కంటే పత్తిసాగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరిగింది. ఈ ఏడాది 25 నుంచి 30 శాతం సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఎకరాకు రెండున్నర ప్యాకెట్ల వరకు విత్తనాలను రైతులు వినియోగిస్తారు. ఈ క్రమంలో గతంకంటే ఈ సారి విత్తనాలపై రైతుకు అదనపు భారం పడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com