ఆదోని మండల పరిధిలోని దిబ్బనకల్ గ్రామంలో నీటి సమస్యతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బుధవారం గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి నీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని, రాబోయే వేసవి కాలంలో నీటి సమస్య మరింత జఠిలమయ్యే అవకాశముందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ముందస్తు చర్యలు తీసుకొని నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.