అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలు, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. మహిళల సేవలను కొనియాడారు. ప్రజాప్రతినిధులు, అధికారిణులు, ఉపాధ్యాయినులు, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా పలు చోట్ల రంగవల్లులు, మ్యూజికల్ ఛైర్స్ వంటి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.