తిరుమలలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారు ఇవాళ ఉదయం చిన్న శేష వాహనంపై వహరించారు. తిరుమాఢ వీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామిని సేవించుకుని భక్తులు పులకించిపోయారు. సాయంత్రం స్వామి వారికి హంస వాహన సేవ జరుగనుంది. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.