తూర్పు గోదావరి: తాళ్లరేవు మండలంలోని అరటికాయలంక ఇసుక ర్యాంపు సమీపంలో మంగళవారం గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువకుడి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.