గుంటూరు: గుట్టు చప్పుడుకాకుండా పొలాల్లో పేకాట ఆడుతున్న 5గురు వ్యక్తులను నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నగిరి నగర్ పొలాల్లో సోమవారం పేకాటఅడుతున్నట్లు స్పెషల్ బ్రాంచ్ సిఐకి సమాచారం రావడంతో ఎస్ఈబి 1 అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఈబి అధికారులు పేకాట స్థావరoపై దాడి చేసి వారిని అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.