ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విలువలకు నిలువుటద్దం రతన్ టాటా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 10:59 PM

రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, ఈ దేశానికి తీరని లోటని, ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని, ఈ దేశం గొప్ప మానవతావాది కోల్పోయిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విలువలకు నిలువుటద్దం రతన్ టాటా అని ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజమని అన్నారు. పుట్టుకతో కోటీశ్వరుడైనా, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినా, సామాన్య జీవనం సాగించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని కొనియాడారు. ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com