పూణెలో శనివారం 16,296 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. పూణే మునిసిపల్ కార్పొరేషన్ పరిమితులలో ఓమిక్రాన్ కేసులు 1,002 నమోదయ్యాయి.రాష్ట్ర ఆరోగ్య అధికారుల ప్రకారం, పూణె జిల్లాలో గత 24 గంటల్లో 13 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.పూణె జిల్లాలో మొత్తం 1,331,866 లక్షల కోవిడ్ కేసులు ఉన్నాయి. వీరిలో 1,228,092 మంది కరోనా నుండి కోలుకున్నారు. జిల్లాలో మొత్తం 20,267 మంది మరణించారు. ప్రస్తుతం పూణె జిల్లాలో 83,507 యాక్టివ్ కేసులు ఉన్నాయి.