ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2020: బెంగళూర్- ముంబైల సమరంలో గెలుపెవరిది?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 28, 2020, 11:57 AM

ఐపీఎల్ 13 లో భాగంగా నేడు అబుదాబిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటివరకూ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మొత్తం 26 మ్యాచులు జరగ్గా, బెంగళూర్ 10, ముంబై 16 మ్యాచ్ ల్లో గెలిచింది. ఇక తాజాగా అబుదాబిలో జరుగనున్న మ్యాచ్ లో గెలుపు కోసం నువ్వా-నేనా అనేలా కసరత్తు ప్రారంభించాయి. మరి ఇరు జట్ల బలాబలాలు విశేషాలు తెలుసుకుందాం పదండి.
ప్రదర్శన అంతంత మాత్రమే:
ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే యువ క్రీడాకారుడు దేవదత్‌ పడిక్కల్ అదరగొట్టాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ చేయలేని పని యువ దేవదత్‌ పడిక్కల్‌ చేసి చూపించాడు. అర్ధ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. చెన్నైతో జరిగిన గత మ్యాచ్ లో ఓటమిపాలైన బెంగళూర్ టీమ్ నిరుత్సాహంతో లేరు. టాప్‌ ఆర్డర్‌లో పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌ రాకతో రాయల్‌ చాలెంజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కనిపిస్తోంది. విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌పైనే పూర్తిగా ఆధార పడాల్సిన అవసరం లేదనే దీమా ఆ జట్టులో కనిపిస్తోంది. ఇక విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్ ల ప్రదర్శన ఈ సీజన్ లో అంతంత మాత్రంగానే ఉంది. బౌలింగ్‌లో బెంగళూర్‌ జోరుమీదుంది. డెల్‌ స్టెయిన్‌, నవదీప్‌ సైని, యుజ్వెంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌లతో కూడిన విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.
పటిష్టంగానే:
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఈ జట్టు మరోసారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. రాజస్థాన్ తో జరిగిన గత మ్యాచ్ లో పరాభవం పాలైన జట్టు ఈసారి నెగ్గాలని భావిస్తుంది. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్‌తో కలిసి ముంబై ఇన్నింగ్స్‌‌ పటిష్టంగా ఉంది. వీరి బ్యాటింగ్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, కీరన్ పొలార్డ్‌లతో మిడిలార్డర్‌ కూడా బలంగా ఉంది. అయితే, బ్యాటింగ్‌లో బలంగా ఉన్న ముంబై.. బౌలింగ్‌లో మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం ఆ జట్టును ఇబ్బంది పెట్టే అంశం. మలింగా గైర్హాజరీతో బుమ్రాపైనే పేస్ భారం పడనుంది.
తుది జట్లు (అంచనా)
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ :
దేవదత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, శివం దూబె, జోశ్‌ ఫిలిప్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైని, డెల్‌ స్టెయిన్‌, యుజ్వెంద్ర చాహల్‌.
ముంబై ఇండియన్స్:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ , సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, నేథన్‌ కౌల్టర్‌ నైల్‌, రాహుల్‌ చాహర్, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా
టీమ్ వివరాలు సంక్షిప్తంగా
టీమ్ పేరు : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్
కెప్టెన్: విరాట్‌ కోహ్లి
యజమాని: రాయల్‌ చాలెంజర్స్‌ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్
విజేత : -
రన్నరప్ : 2009, 2011, 2016
టీమ్ వివరాలు సంక్షిప్తంగా
టీమ్ పేరు : ముంబై ఇండియన్స్
కెప్టెన్: రోహిత్ శర్మ
యజమాని: ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్
విజేత : 2013, 2015, 2017, 2019
రన్నరప్ : 2010






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com