ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాపై మీ సందేహాలు.. డాక్టర్ సమాధానాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 07, 2020, 03:33 PM

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తుమ్మితే కరోనా వచ్చినట్లేనా? దగ్గితే కరోనా ఉన్నట్లేనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


 


ప్రశ్న: అస్తమా ఉన్నవాళ్లకు కరోనా వస్తే బతుకుతారా?


 


జవాబు: సాధారణ వ్యక్తుల కంటే అస్తమా ఉన్నవారికి కరోనా తొందరగా సోకే ప్రమాదం ఉంది. మిగతా వారి కంటే ఆలస్యంగా వీరికి నయం అవుతుంది. అంతే కానీ బతకరని అపోహలు వద్దు.


 


ప్రశ్న: కరోనా లక్షణాలు ఎన్నిరోజులకు బయటపడతాయి?


 


జవాబు: 14 రోజుల్లోపు బయట పడతాయి.


 


ప్రశ్న: మా చెల్లికి ఏడు రోజుల నుంచి దగ్గు వస్తుంది?


 


జవాబు: దగ్గు ఒక్కటే వస్తే భయ పడొద్దు. దగ్గుతో పాటు ఇతర లక్షణాలు కనిస్తే అప్పుడు ఆలోచించండి


 


ప్రశ్న: కూరగాయలు, ఆకు కూరల ద్వారా కరోనా వస్తుందా?


 


జవాబు: వాటి మీద కరోనా వైరస్ ఉన్న వారి నుంచి తుంపర్లు పడినప్పుడు మనం మళ్లీ వాటిని ముట్టుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. ఆకు కూరలు, కూరగాయలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాడడం మంచిది.


 


ప్రశ్న: నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. పారసిటమల్ టాబ్లెట్ వాడితే తగ్గిపోయింది. కానీ వీక్ అయ్యాను?


 


జవాబు: సాధారణంగా జ్వరం వచ్చిన సమయంలోనూ మనం వీక్ అవుతాము. అనవసరంగా భయపడొద్దు.


 


ప్రశ్న: సార్.. ఈ నెల 2న మా ఊరికి ఓ మీడియా వాళ్లు వచ్చారు. ఊరంతా తిరిగారు. 3న ఆ కెమెరామెన్ కు కరోనా వచ్చింది. మాకేమైనా ప్రమాదమా?


 


జవాబు: వాళ్లతో దగ్గరగా ఉన్న వారికి మాత్రమే కరోనా వచ్చే అవకాశం ఉంటుంది. కరోనా వచ్చిన వారితో దగ్గరగా తిరిగిన వాళ్లు 14 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలి.


 


ప్రశ్న: నాగు దగ్గు ఉంది. ఫివర్ 99 ఉంది. దగ్గు గంటకు రెండు సార్లు చొప్పున వస్తుంది. ఏదైనా ప్రమాదమా?


 


జవాబు: ఈ లక్షణాలతో కరోనా అని చెప్పలేము. జ్వరం అధికమై, ఇతర లక్షణాలు కనిపిస్తే అప్పుడు డాక్టరును సంప్రదించండి.


 


ప్రశ్న: మా సోదరి వాళ్ల భర్త ఇటీవల కరోనా చనిపోయాడు. నేను శనివారం ఆమెను తాకాను. నాకు ఇప్పుడు కాళ్లు నొప్పిగా ఉన్నాయి. కరోనా అంటారా?


 


జవాబు: కాళ్ల నొప్పులకు కరోనాకు సంబంధం లేదు. అనవసరంగా భయపడకండి. మీరు తాకిన వారికి కరోనా వస్తే అప్పుడు మాత్రమే మీకు కరోనా వచ్చే అవకాశాలు ఉంటాయి.


 


ప్రశ్న: ఇటీవల మా భర్త ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లారు. ఆయనకు కరోనా వచ్చింది. మా ఆయనకు ముక్కు కారడం, దగ్గుగా ఉంది. ఈఎన్ టీ హాస్పటల్ కి వెళ్లినా అలానే ఉంది. కరోనా అంటారా?


 


జవాబు: మీరు ఈఎన్ టీ హాస్పటల్ కి వెళ్లారు అని చెప్పారు. ఒక వేళ మీ భర్తకు కరోనా లక్షణాలు ఉంటే అక్కడి డాక్టర్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించేవారు. ఎంతకూ తగ్గకపోతే మళ్లీ హాస్పటల్ కు వెళ్లి వారి సూచనలమేరకు నడుచుకోండి. అనవసరంగా భయపడకండి.


 


ప్రశ్న: సార్.. మా వైఫ్ కు రెండు రోజులుగా దగ్గు, కళ్లు మంటలు, లైట్ గా ఫివర్ ఉంది?


 


జవాబు: ఈ లక్షణాలతో కరోనా అని చెప్పలేం. జ్వరం అధికంగా రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు కరోనా గురించి ఆలోచించండి.


 


ప్రశ్న: నా వయస్సు 25 సంవత్సరాలు, నాకు లివర్ సమస్య ఉంది. నాకు కరోనా వస్తే ఏదైనా సమస్యా?


 


జవాబు: సాధారణ వ్యక్తుల కంటే ఇలాంటి సమస్యలు ఉన్న వారికి కరోనా తొందరగా సోకుతుంది. నయం కావడం కూడా ఆలస్యం కావొచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది.


 


ప్రశ్న: మమ్ముల్ని హోం క్వారంటైన్ లో ఉండమంటున్నారు. మా ఇంట్లో ఒకటే బాత్రూం ఉంది. సమస్యా?


 


జవాబు: వాడిన ప్రతీ సారి శుభ్రం చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.


 


ప్రశ్న: మా వైఫ్ కు సైనస్ ఉంది. అంతకు ముందు శీతాకాలం తలస్నానం చేసినప్పుడు మాత్రమే తుమ్ములు వచ్చేవి. కానీ ఇప్పుడు సాధారణంగానే వస్తున్నాయి?


 


జవాబు: వాతావరణం చల్లగా ఉండడం వల్ల కావొచ్చు. అనవసరంగా భయపడొద్దు.


 


ప్రశ్న: గొంతు నొప్పి, గొంతులో ఏదో ఉన్నట్లు అనిపించి, శ్వాస ఆడడం లేదు?


 


జవాబు: భయపడాల్సిన పని లేదు. ఎంతకూ తగ్గకపోతే డాక్టరును సంప్రదించండి.


 


ప్రశ్న: గొంతు నొప్పి, కడుపునొప్పి, తలనొప్పి ఉంది, వాంతులు అవుతున్నాయి?


 


జవాబు: ఇవి కరోనా లక్షణాలు కావు. తగ్గకపోతే దగ్గరలోని డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోండి తగ్గిపోతుంది.


 


ప్రశ్న: చిన్న పిల్లల్లో దద్దుర్లు వచ్చి పోవడం కరోనా అంటారా?


 


జవాబు: కాదు


 


ప్రశ్న: మా బాబు మూత్రం పసుపు రంగులో వస్తుంది?


 


జవాబు: వేడి చేయడం లేదా నీళ్లు సరిగా తాగకపోవడం వల్ల కావొచ్చు. ఎంతకూ తగ్గకపోతే డాక్టరును సంప్రదించి మూత్ర పరీక్ష చేయించుకోండి.


 


ప్రశ్న: మా పక్కింట్లో ఉండే వ్యక్తికి మామూలు జ్వరం వచ్చింది. పరీక్ష చేయిస్తే కరోనా వచ్చింది. అతను మా బాబును ఎత్తుకున్నాడు ఏదైనా సమస్య అంటారా?


 


జవాబు: లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోండి. 14 రోజుల పాటు జాగ్రత్తగా ఉండండి.


 


ప్రశ్న: మా అల్లుడికి ఐదు రోజులుగా జ్వరం వస్తుంది. సిరప్ ఇచ్చాక తగ్గుతుంది, సీఆర్పీ లెవల్ 64 % ఉంది. యాంటిబయోటిక్స్, జ్వరం సిరప్ ఇచ్చి పంపించారు. ఏదైనా సమస్యా?


 


జవాబు: జ్వరం మళ్లీ మళ్లీ వస్తుంటే ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిది.


 


ప్రశ్న: మా నాన్నకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. డిన్నర్ లో పెరుగు తింటారు. కూల్ వాటర్ తాగుతారు. ఇప్పుడు జలుబు, దగ్గు ఉంది. కరోనా లక్షణమా?


 


జవాబు: కాదు. కూల్ వాటర్ తాగడం కారణంగా జలుబు, దగ్గు వస్తుంది కావొచ్చు. కూల్ వాటర్ మానేస్తే మంచిది.


 


ప్రశ్న: కాలుకు పుండు అవడంతో మూడు రోజుల క్రితం జ్వరం వచ్చింది. ఈ రోజు నుంచి శ్వాస ఆడడం లేదు. తుమ్ములు వస్తున్నాయి. ఏదైనా సమస్యా?


 


జవాబు: కాలుకు పుండుకు శ్వాస ఆడకపోవడానికి, తుమ్ములకు సంబంధం లేదు. ఒక సారి దగ్గరలోని డాక్టరును సంప్రదించి వారి సూచనల మేరకు పరీక్షలు చేయించుకోండి.


 


ప్రశ్న: నాకు ఐదు రోజుల నుంచి జ్వరం వస్తుంది. జలుబు వస్తుంది. మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్ తీసుకుని వేసుకున్నా తగ్గడం లేదు?


 


జవాబు: జలుబు, జ్వరం వచ్చినంత మాత్రాన కరోనా అని చెప్పలేం. ఇతర లక్షణాలు కనిపిస్తే అప్పుడు కరోనా గురించి ఆలోచించండి. ఎంతకూ తగ్గకపోతే డాక్టరును సంప్రదించండి


 


ప్రశ్న: మాంసంపై కరోనా ఎంతసేపు ఉంటుంది?


 


జవాబు: ఇంత సేపు అని ఖచ్చితమైన సమయం చెప్పలేం. తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి వండితే ఏ సమస్య ఉండదు.


 


ప్రశ్న: మా అమ్మ 12 రోజుల క్రితం కరోనా పేషెంట్ ను కలిసింది. ఇప్పుడు జలుబు వచ్చింది. వర్షంలో కూడా తడిసింది?


 


జవాబు: వర్షంలో తడిసిందని చెబుతున్నారు కాబట్టి జలుబు అందువల్లనే కావొచ్చు. ఇతర లక్షణాలు కనిపిస్తే అప్పుడు కరోనా గురించి ఆలోచించండి.


 


ప్రశ్న: మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్లకు కరోనా వచ్చింది. మాకు సమస్యా?


 


జవాబు: మీ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్లకు కరోనా వచ్చినంత మాత్రానా మీకు రాదు. వారితో దగ్గరగా తిరిగిన వారికి, ముట్టుకున్న వారికే వచ్చే అవకాశం ఉంటుంది.


 


ప్రశ్న: మా పాపకు 12 నెలలు, రెండు రోజుల నుంచి జ్వరం వస్తోంది. డాక్టర్ దగ్గరకు వెళ్లే సిరప్ ఇచ్చారు. అది తాగితే తగ్గి మళ్లీ ఎనిమిది గంటలకు వస్తుంది. ఏదైనా సమస్యా?


 


జవాబు: మీ ఇంట్లో ఎవరికీ రాకుండా పాపకు కరోనా వచ్చే అవకాశం లేదు. భయపడకండి. జ్వరం తగ్గకపోతే మళ్లీ డాక్టరును సంప్రదించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com