ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ల నిడివిని నాలుగు రోజులకు కుదించాలనే ఐసీసీ ప్రతిపాదనను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ కూడా వ్యతిరేకించాడు. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ల నిర్వహణ పట్ల తాను ఆసక్తి చూపడం లేదన్నాడు. ఆదివారం క్రికెట్ ఆస్ట్రేలియాతో పాంటింగ్ మాట్లాడుతూ... 'నాలుగు రోజుల టెస్టులకు నేను పూర్తిగా వ్యతిరేకం. ఈ ఆలోచన వెనుక కారణాలను తెలుసుకోవాలనుకుంటున్నా' అని అన్నాడు. 'గత రెండు ఏళ్లలో చాలా టెస్టులు నాలుగు రోజుల్లోనే ముగిశాయి. ఈ విషయం అందరికి తెలుసు. కానీ.. గత దశాబ్దంలో ఎక్కువ మ్యాచ్లు డ్రాలే అయ్యాయి. ఆ సమయాల్లో నాలుగు రోజుల టెస్టులే ఉండి ఉంటే.. దాదాపు అన్ని మ్యాచ్లు డ్రాలే అయ్యేవి. ఇక్కడ వాణిజ్యపరమైన కోణం ఉందని అర్థం చేసుకున్నా. డబ్బులు ఆదా చేయడం కోసం ఆదివారం మ్యాచ్ ముగియడానికి గురువారం ఎలా ప్రారంభిస్తారు' అని పాంటింగ్ ప్రశ్నించాడు.