కోల్కతా : పశ్చిమ బెంగాల్ జల్పైగురి జిల్లాలోని బంధునగర్లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురవడంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదస్థలికి చేరుకున్న నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. క్షతగాత్రుడిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం సంభవించడంతో అక్కడ భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.