ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స‌రి-బేసి విధానాన్ని ఉల్లంఘిస్తే 4వేలు జ‌రిమానా

national |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2019, 12:44 PM

హైద‌రాబాద్‌: దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌ళ్లీ స‌రి-బేసి విధానాన్ని ప్ర‌వేశ‌పెడుతున్నారు. న‌వంబ‌ర్ 4 నుంచి 15వ తేదీ వ‌ర‌కు స‌రి-బేసి సంఖ్య‌లో వాహ‌నాలు రోడ్డెక్కాల్సి ఉంటుంది. ఇత‌ర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వ‌చ్చే వాహ‌నాల‌కు కూడా ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంద‌ని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. నాన్ ట్రాన్స్‌పోర్ట్ ఫోర్‌వీల‌ర్ వాహ‌నాల‌కు స‌రి-బేసి విధానం అమ‌ల‌వుతుంద‌న్నారు. ద్విచ‌క్ర వాహ‌నాల‌కు ఈ నిబంధ‌న నుంచి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు సీఎం చెప్పారు. ఉద‌యం 8 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు స‌రి-బేసి విధానంలో వాహ‌నాలు రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. ఆదివారాలు మిన‌హాయింపు ఉంటుంద‌న్నారు. స‌రి-బేసి విధానాన్ని ఉల్లంఘిస్తే 4వేల జ‌రిమానా విధించ‌నున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com