ప్రపంచ నేతల్లో ఏ నాయకుడికి కూడా లేనంత మంది ఫాలోయర్లు దక్కించుకుని భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ సరి కొత్త రికార్డు సృష్టించారు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ప్రధాని మోదీ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఖాతా ఆరంభించి ప్రజలకు పలు సూచనలు చేస్తూనే, ఇతరులు చెప్పేదాన్ని వింటారు. ఇక్కడ ఆయనకు ఏకంగా 30 మిలియన్ల ఫాలోయర్లు చేరారు. ప్రపంచంలో ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ స్థాయిలో ఫాలోయర్లు ఉన్న నేత మోదీ ఒక్కరే. ప్రధాని మోదీ తర్వాత స్థానంలో ఇండొనేసియా ప్రధాని (25.06 మిలియన్ల ఫాలోయర్లు) జోకో విడోడో ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (24.8 మిలియన్ల ఫాలోయర్లు), అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (14.9 మిలియన్ల ఫాలోయర్లు) కంటే కూడా మోదీ చాలా ముందున్నారు అని తెలుస్తుంది.