ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిరేజ్-5 ఫైటర్ విమానాలను కొనుగోలు చేస్తున్న పాక్

international |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2019, 01:13 PM

ఈజిప్ట్ వాడకుండా వదిలేసిన 36 దస్సాల్ట్ మిరేజ్-5 ఫైటర్ విమానాలను కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ చర్చలు ప్రారంభించింది. త్వరలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు రాఫెల్ విమానాలు డెలివరీ కానుండగా, ఇదే సమయంలో పాక్, మిరేజ్-5ల కొనుగోలు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. ఈ విమానాలను గతంలోనే ఈజిప్ట్ పక్కన పెట్టింది. 


కాగా, ప్రస్తుతం ఇండియా వద్ద ఉన్న మిరేజ్-2000 యుద్ధ విమానాలతో పోలిస్తే, పాక్ కొనుగోలు చేయాలని చూస్తున్న ఫైటర్ జెట్స్ సామర్థ్యం చాలా తక్కువ. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో బాలాకోట్ టెర్రర్ క్యాంపులపై ఇండియా మిరేజ్-2000లతోనే దాడులు చేసింది. ప్రస్తుతం పాక్ వద్ద 92 మిరేజ్-5, 87 మిరేజ్-3 జెట్ విమానాలతో పాటు, అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్-16 ఫాల్కన్లు, జెంగ్డూ జే-7, జేఎఫ్-17 థండర్ కాంబాట్ జెట్ విమానాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com