ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయ నగరాల అధ్యయనంతో అమరావతి రూపకల్పన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2017, 01:10 AM

(అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి) : అమరావతిని ఆకర్షణీయ(స్మార్ట్‌) నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక వసతుల పరంగా కావాల్సిన ప్రణాళికలన్నీ రూపొందాయి. అంతర్గత రహదారుల నుంచి మంచినీరు, విద్యుత్తు సరఫరా, మురికినీటి పారు దల వ్యవస్థ, వరద నీటి నియం్తణ్ర, శాంతిభద్రతల పరిరక్షణ, విపత్తు నిర్వహణ సహా మొత్తం 13 రకాల ప్రణాళికలు తయారయ్యాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, బ్రిటన్‌ నుంచి జపాన్‌ వరకు ప్రపంచం నలుమూలల ఉన్న అంతర్జాతీయ నగరాల్లోని ప్రాథమిక వసతుల్ని అధ్యయనం చేసి వీటిని రూపొందించారు. నివసించే జనాభా నుంచి ఏర్పాటయ్యే పరిశ్రమల వరకు ప్రతి అంశంలోనూ 2050 సంవత్సరం నాటికి అవసరమయ్యే వసతుల్ని అంచనా వేసి వాటికి అనుగుణంగా తయారుచేశారు. దేశంలోని నగరాలన్నింటిలో నిత్యం ఎదుర య్యే సమస్యలేమీ ఇక్కడ ఆలోచించటానికి కూడా అవకాశం లేనంత స్థాయిలో వీటిని రూపొందించారు. కాలుష్యానికి వీలు లేని రీతిలో పూర్తి పర్యావరణ అనుకూల విధానాల్ని అనుసరిస్తున్నారు. ప్రతి అంశంలోనూ ఆయా వసతుల ఏర్పాటు, నిర్వహణ సులువుగా ఉండేందుకు నగరాన్ని జోన్లగా విభజించారు. ఏడాదిన్నర కిందట సింగపూర్‌ సంస్థలిచ్చిన నగర ప్రణాళికల ఆధారంగానే అన్నిరకాల సౌకర్యాలు సమకూర్చేందుకు వీలుగా చ్కెనాకు చెందిన గిజౌ మారిట్కెం సిల్క్‌ రోడ్గ ఇంటర్నేషనల్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌(జీఐఐసీ) ఆర్‌వీ అసోసియేట్స్‌ సంయుక్తంగా ‘స్మార్ట్‌ సిటీ అమరావతి’ పేరుతో సమీకత ప్రాథమిక వసతుల మాస్టర్‌ ప్లాన్‌ని రూపొందించాయి. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విడుదల చేశారు. 


తుపాను, భూకంపాలను ఎదుర్కొనేలా ప్రణాళిక : తుపాన్లు, భూకంపాల వంటి ప్రకతి విపత్తులకు సంబంధించి రాజధాని ప్రాంతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అప్రమత్తత చర్యలు పాటించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఈ ప్రాంతంలో గత వందేళ్లలో వచ్చిన తుపాన్ల నుంచి వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేశారు. గత వందేళ్లలో 72 తుపాన్లు రాష్ర్టంలో తీరం దాటాయి. ఇందులో 46 తీవ్ర తుపాన్లు. కష్ణా తీరంలోని కొండవీటివాగు, పాలవాగుకు, కాలువలకు వరద తాకిడి ఉంటుంది. మరో వ్కెపు వేసవిలో ఇక్కడ వడగాలుల ప్రభావం ఎక్కువ. ఈ క్రమంలో ప్రభుత్వపరంగానే కాకుండా ప్రజల్లో కూడా అప్రమత్తత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విపత్తు సంభవించే విషయాన్ని ముందుగానే హెచ్చరించే వ్యవస్థ ఏర్పాటు. ప్రమాదం తీవ్రతపై అవగాహన కల్పించడం తోపాటు వర్షపాతంతోపాటు నదిలో నీటిమట్టం, హెచ్చరికల గురించి రేడియో, టీవీ, ఫోన్‌ల ద్వారా సమాచారం ఇవ్వడం, ప్రతి ఇంటికీ విపత్తు సమాచారం చేర్చే ఏర్పాటు. విపత్తు సమయంలో బాధితుల్ని గుర్తించి రక్షించే వ్యవస్థ, వారికి అవసరమైన సాయం అందజేత. ఇందుకు అనుగుణంగా రాజధాని ప్రాంతంలో విపత్తు సమయంలో అత్యవసరంగా స్పందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్గ వేదికకి రూపకల్పన. ముందుగానే విపత్తు సమాచారం అందుకోవడం నుంచి ఎదుర్కొనే చర్యల వరకూ సంయుక్తంగా ఈ వేదిక నుంచే పర్యవేక్షణ. తుపాను రక్షిత కేంద్రాలు, వాటి ఆధునికీకరణ. అత్యవసర సమ యాల్లో విపత్తు బాధితులకు ఆశ్రయమిచ్చేందుకు శాశ్వత రక్షిత కేంద్రాలతోపాటు కేంద్ర అత్యవసర భవనాలు నిర్మించడం. ప్రతి టౌన్‌షిప్‌లో రక్షిత భవనాల ఏర్పాటు. భూకంపాల్ని తట్టుకొనేందుకు ప్రత్యేక చర్యలు. ఇందుకు అనుగుణంగానే నూతన భవనాల నిర్మాణాల ప్రణాళికలు ఉండేలా నిబంధనలు. భూకంపం సంభవిస్తే రక్షించేందుకు అవసరమైన ప్రమాణాలు పాటించడం. ప్రజల్లో ఇందుకు సంబంధించిన అవగాహన కల్పన. కుప్ప కూలిన నిర్మాణాల నుంచి రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ సిద్ధం చేసుకోవడం. అమరావతిలో 2050 నాటికి జీరో శాతానికి వ్యర్థాలను తీసుకురావాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. 


వందశాతం సహజవాయువు వాడకం : ఈనాడు, అమరావతి: పర్యావర ణహితం, కాలుష్యరహితం కోసం హానికరమైన వాయువుల్ని నియంత్రించి స్వచేమైన గాలి అందించేలా వందశాతం సహజ వాయువు వాడకమే లక్ష్యంగా అమరావతి అభివద్ధి ప్రణాళిక తయారు చేశారు. నెల్లూరు-విజయవాడ మధ్య పైప్‌లైన్‌ నిర్మాణానికి ఇప్పటికే ఆమోదం లభించింది. నగరానికి తూర్పుదిశగా సాగే ఈ మార్గం నుంచి రాజధానికి అవసరమైన గ్యాస్‌ తీసుకుంటారు. గహ, వాణిజ్య వినియోగానికీ అధిక, మధ్యస్థాయి ఒత్తిడి పైప్‌లైన్ల ద్వారా సరఫరా అందిస్తారు. రాజధాని చుట్టూ అధిక ఒత్తిడి గొట్టపుమార్గం, తూర్పు- పశ్చిమ ప్రాంతాల్లో రెండు గేట్‌స్టేషన్లు, మరో రెండు అధిక, మధ్యస్థాయి ఒత్తిడి నియంత్రిత కేంద్రాలను నిర్మిస్తారు. వీటికి అనుసంధానిస్తూ మధ్యస్థాయి ఒత్తిడి గొట్టపుమార్గాన్ని నగరమంతా విస్తరించి నాలుగు వలయాలద్వారా నిర్దేశిత ప్రాంతాలకు పంపిస్తారు. చైనాలోని 6 నగరాలతో పాటు అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌, దిల్లీ, విజయవాడలో గ్యాస్‌ వినియోగం, అక్కడి ప్రమాణా లను పరిశీలించి ఇక్కడ అనుసరించాల్సిన విధానం తయారు చేశారు. చైనా, టొరంటో, అమెరికా, ఫ్రాన్స్‌, రష్యా, జపాన్‌, భారత్‌లోని గొట్టపుమార్గాలను పరిశీలించారు. వాటిలో మేలైనవాటిని ప్రతిపాదించారు. సిటీ గేట్‌ స్టేషన్‌ నుంచి రాజధానిని అనుసంధానిస్తూ గొట్టపుమార్గాలు నిర్మించి 20 స్టేషన్లు నిర్మిస్తారు. అక్కడ నుంచి సరఫరా జరుగుతుంది. స్మార్ట్‌ గ్యాస్‌ మేనేజ్‌మెంట్‌ విధానంలో పర్యవేక్షిస్తారు. 2050నాటికి పెట్రోలు, డీజిల్‌, బొగ్గు వాడకం అనేవే అమరావతి ప్రాంతంలో ఉండవు. తక్కువ ఖర్చు, సమర్థవంతంగా వినియోగం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అంతరాయంలేని సరఫరా ఇవ్వాలని ప్రణాళికల్లో పొందుపరిచారు.


రాజధానికి రక్షితజలం : వచ్చే 30 ఏళ్ల అవసరాలను దష్టిలో పెట్టుకుని అప్పటికి రాజధాని జనాభా 47.26 లక్షలుగా అంచనా వేసి తాగునీటి ప్రణాళిక తయారుచేశారు. ఇక్కడుండే అందరికీ ఒక్కొక్కరికి రోజుకు 150 లీటర్ల చొప్పున నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుత ఆనకట్టతోపాటు కష్ణానదిపై వైకుంఠపురం వద్ద నిర్మించే మరో బ్యారేజి నుంచి నీటిని తీసుకుంటారు. శుద్ధి చేసి సరఫరా చేస్తారు. రాజధాని మొత్తాన్ని కలుపుతూ 45 కిలోమీటర్ల ప్రధాన గొట్టపుమార్గం, మధ్యలో 24 ట్యాపింగ్‌పాయింట్లు ఏర్పాటుచేసి 60 నీటి సరఫరా కేంద్రాలకు అనుసంధా నిస్తారు. నీటి నిర్వహణకు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటవుతాయి 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com