వైయస్ జగన్ మోహన్ రెడ్డి సృష్టించిన ప్రజా సంపదను చంద్రబాబు తన వాళ్లకు దోచిపెడుతున్నారని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మూడు పోర్టు పనులను నిలుపుదల చేసి చంద్రబాబు అమ్మకానికి పెట్టారని ధ్వజమెత్తారు. సందప సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ..వైయస్ జగన్ హయాంలో సృష్టించిన సంపదను స్వప్రయోజనాల కోసం చంద్రబాబు తెగ నమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
50 శాతం పూర్తైన పోర్టు పనులకు మళ్లీ టెండర్లు పిలవడం ఎలా చూడాలని ప్రశ్నించారు. పెరుగుతున్న విద్యుత్ చార్జీలు ఒకపక్క, అలాగే నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలను అదుపు చేయలేక కూటమి సర్కార్ చేతులెత్తేసిందని విమర్శించారు. నయా పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచమని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు ఐదు నెలల్లోనే రూ.6072 కోట్ల భారం ప్రజలపై మోపనున్నారని పేర్కొన్నారు.