వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (29.10.2024) వైయస్ఆర్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి వైయస్ జగన్ బయలుదేరి 10.45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. వైయస్ జగన్ మూడు రోజుల పాటు పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.