లడ్డూ కల్తీపై సిట్ వస్తుంది సమాధానం చెప్పు అంటూ టీడీపీ పెట్టిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చింది వైసీపీ. చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్సే అని విమర్శలు గుప్పించింది. లడ్డూ వ్యవహారంలో కూడా ఆయన పద్ధతి ఇదే అని ఆరోపించింది.
వీటికి సమాధానాలు చెప్పకుండా.. ఈ డైవర్షన్లు ఎందుకు అని టీడీపీ ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేసింది. "మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు... కనీసం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లకైనా సమాధానం చెప్పు" అని ప్రశ్నలు సంధించింది.