ఎన్నికల్లో విజయంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉందని, గతం కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్ మీద అంత వ్యతిరేకత పెంచుకున్న చంద్రబాబు కూటమిలో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదన్నారు.