ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిలిఫ్పీన్స్‌లో భారీ భూకంపం

international |  Suryaa Desk  | Published : Sun, Dec 03, 2023, 09:42 AM

ఆసియా దేశం ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మిండనావోలో శనివరాం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC) తెలిపింది.భూమికి 63 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు చెప్పింది.భారీ భూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ సునామీ హెచ్చరికల్ని జారీ చేసింది. గత నెల ప్రారంభంలో కూడా దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 6.7 భూకంపం సంభవించింది. దీంతో 8 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి.పసిఫిక్ మహా సముద్రంలో 'పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్' అనే ప్రదేశంలో ఇండోనేషియా, ఫిలిఫ్పీన్స్, జపాన్ వంటి దేశాలు ఉన్నాయి. దీంతో అక్కడ తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు నిరంతరం చోటు చేసుకుంటాయి. దీంతో పాటు క్రియాశీలక అగ్నిపర్వతాలకు ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది. దీంతోనే ఇక్కడ తరుచుగా భూకంపాలు వస్తుంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com