ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికార పార్టీలో టెన్షన్‌ మొదలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2017, 12:32 AM

 ప్రభుత్వాలపై వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత ఖంగు తినిపించిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సంక్షేమ పథకాలపై మరింత దృష్టికి యోచన


విజయవాడ, మేజర్‌న్యూస్‌ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మిగిలిన రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అధినేతలకు, నాయకులకు ఈ ఫలితాలు మింగుడు పడడం లేదు. పూర్తి ప్రజావ్యతిరేకతను స్పష్టంగా తెలియజేస్తూ ఓటు శక్తిని చాటిచెప్పాయి. పాలనపై తమకున్న వ్యతిరే కతను మూకుమ్మడిగా వెలుగెత్తి నినదించాయి. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖాండ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌లో ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ ఫోల్‌‌సను సైతం తూర్పా రబెట్టాయి. ఓటుహక్కు విశ్వసనీయతను దేశవ్యాప్తంగా చర్చింకునేలా చేశాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ అధికార పార్టీలోనూ ఇదే అంశంపై టెన్షన్‌ మొదలయి నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే విధంగా ప్రభుత్వంపై వ్యతి రేకత వస్తే పరిస్థితి ఏమిటోనన్న టెన్షన్‌ మొదలయినట్లు తెలుస్తోంది. ప్రజలకు జవాబుదారీగా పాలన సాగకపోతే ఎంత సీనియారిటీ ఉన్న పార్టీనైనా ఓటర్లు ఇంటికి సాగనంపుతారని ఈ రిజల్‌‌ట్స తెలియజేశాయి. దీంతో ఏపీ రాజకీ యాలు ఆసక్తికరంగా మారనున్నాయి.


    ఇప్పటికే నవ్యాంధ్రలో అసెంబ్లీ సమా వేశాలు, ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు పేరును సీబీఐ అఫిడవిట్‌లో ప్రస్తావించడం, కేసు విచారణకు సుప్రీంకోర్టు తీసుకోవడం వంటి అంశాలతో ఇప్పటికే ఏపీ రాజకీయం హీటెక్కింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరింత ప్రభావాన్ని చూపించే అవకాశం లేకపోలేదు. దీంతో టీడీపీ అధినాయకత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు సమాయత్తం కానుంది. పేదలకు, నిరుద్యోగులకు మరింత సంక్షేమ పథకాలు అందిం చేందుకు సిద్ధమవుతుంది. రేషన్‌, పింఛన్‌ వంటి పథకాలు మరింత విస్తరింప చేయనుంది. గృహ నిర్మాణాలను వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపడు తున్నది. రాష్ర్ట రాజధాని నిర్మాణం, పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయా లతోపాటు నేరుగా ప్రజలకు అందే సంక్షేమ పథకాలపైనా అదే స్థాయిలో దృస్టి సారించాలని అధినాయకత్వం యోచిస్తుంది. పక్క తెలుగు రాష్ర్టం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. ఏ మా్త్రం అవకాశం ఇచ్చినా దూసుకుపోయేందుకు సిద్ధంగా వ్యూహాలు రచిస్తుంది.  ఈ క్రమంలో అధికార టీడీపీ మరింత నిబద్ధతగా, పారదర్శకంగా వ్యవహరిస్తేనే 2019 ఎన్నికల్లో గెలుపునకు తావుంటుంది. ఇప్పటికే పలు రుణమాఫీలు పూర్తి స్థాయిలో చేయలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారందరినీ సముదాయించకపోతే వచ్చే ఎన్నికల నాటికి వ్యతిరేకతను కుడగట్టుకున్నట్లే అవుతుంది. అది ప్రతిపక్షానికి పూర్తిగా కలిసివచ్చే అవకాశం ఉంటుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com