ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ఒంటరి పోరు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2017, 12:30 AM

 ఏపీలో బాబుతో పొత్తుపై అనుమానాలు తెలంగాణలో తెరాసతో తలపడేందుకు సై  ప్రాంతీయ పార్టీల పతనమే కమలనాథుల వ్యూహం ఎన్నికల్లో ఆంధ్రాకు ప్రత్యేక హోదా మం్త్రం తెలంగాణలో బిసిలకు రాజ్యాధికార తం్త్రం 2019లో తెలుగు రాష్ట్రాలలో బిజెపి కొత్త ఎత్తులు ఇరు రాష్ట్రాలలో బిజెపి బలోపేతానికి కసరత్తు


 (హైదరాబాద్‌, న్యూస్‌నెట్‌వర్‌‌క): దేశ వ్యాప్తంగా బిజెపి హవా కొనసాగుతోంది. మోదీ పాలన పట్ల మొగ్గుచూపుతున్నారు. కనీవిని ఎరుగని రీతిలో కమల నాథులకు ప్రజలు పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాదిన బలోపేతమైన బిజెపి దక్షిణాదిన శక్తివంతమైన పార్టీగా అవతరించేందుకు అడుగులు వేస్తోంది. తాజాగా దేశంలో ఐదు రాషా్టల్ర ఎన్నికల ఫలితాలు చూస్తుంటే.. మోదీ పని తీరును ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారో అర్థం అవుతోంది.  దేశం వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం సాధించే విధంగా మోదీ పరిపాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాషా్టల్రలో బీజేపీ విజయం సాధించడం తధ్యమనిపిస్తోంది. కర్ణాటకలో మొదలు పెట్టి తెలుగు రాషా్టల్ల్రో పార్టీ పాగా వెయ్యడం కొద్ది రోజుల్లోనే జరగనుంది.  2019 ఎన్నికల్లో తెలుగు రాషా్టల్రలో ఒంటరిగా పోటీ చేసిన ప్రాంతీయ పార్టీలైన తెరాస, తెలుగుదేశం పార్టీలకు మట్టి కరిపించేందుకు బిజెపి ఇప్పటికే రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఎపిలో ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా మంత్రాన్ని  తెరపైకి తెచ్చి  అక్కడి ఓట్లు దక్కించుకోవాలన్నదే బిజెపి లక్ష్యంగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ బిజెపి తమతో కలిసి ప్రయాణిస్తుందన్న కలలకు కమల నాధులు కళ్లెం వేయనున్నట్లు తెలియకనే తెలుస్తోంది. కేంద్రలో రాజీపడి ఉండాలని బాబు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. పైపెచ్చు ప్యాకేజీ పేరిట, పరిశ్రమల పేరిట కేంద్ర అడుగులకు మడుగులు ఒత్తుతున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌, వైకాపాను ధీటుగా ఎదుర్కొనేందుకు బిజెపి పొత్తు అవసరమని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రాంతీయ పార్టీల పతనమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బిజెపి ఇకపై వచ్చే ఎన్నికలలలో ఒంటరి పోరుకే సమాయత్తమవుతోందని ప్రాంతీయ పార్టీలు గుర్తించడం లేదు.  ఒంటరిపోరుతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేలా 2018 నాటికి మార్గదర్శక ప్రణాళిక (రోడ్‌ మ్యాప్‌) సిద్ధం చేయాలని ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ బీజేపీ నేతలకు సూచించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా  తెలంగాణలో పార్టీ బలోపేతంతోపాటు రాషా్టభ్రివృద్ధికి పాటుపడాలని , నిత్యం  ప్రజా సమస్యలపై పోరుబాట పట్టాలని కేంద్ర నేతలు స్థానిక బిజెపి నేతలకు పిలుపు నిచ్చారు. తెలంగాణలో  చేతివృత్తులు, బలహీనవర్గాలవారిని బిజెపి ఆకర్షించే పనిలో ఉంది. తెలంగాణలో దళితులను ముఖ్యమంత్రి చేస్తానని అధికారం పీఠం చేజిక్కించుకున్న కెసిఆర్‌ దారిలోనే బిజెపి సైతం బిసిలకు రాజ్యాధికారం అన్న నినాదంతో బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది. మరో చాన్‌‌స ఇస్తే తెలంగాణ అభివృద్ధికి మరింత పాటుపడుతామని తెరాస వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశాలున్నాయని, ఈక్రమంలో తెరాస అజెండాకు ధీటుగా బిజెపి సమాలోచనలు సాగిస్తోంది. ఆలాగే తెలంగాణ తెచ్చింది మేమేనని, తెలంగాణ ఇచ్చింది మేమేనన్న నినాదాలు మరుగున పడే అవకాశాలు సైతం లేకపోలేదు. తెలంగాణ ఎవరు ఇచ్చినా, ఎవర తెచ్చినా? అభివృద్ధి సాధించడమే తమ ముఖ్య లక్ష్యమని బిజెపి తేల్చిచెప్పే అవకాశాలున్నాయి.  తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అమిత్‌షా తెలంగాణ నేతలకు పదే పదే సూచించడం పట్ల తెలంగాణలో బిజెపి ఒంటరిపోరుకు సిద్ధమౌతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో 2019లో తెరాస, కాంగ్రెస్‌, మహాకూటమిలు బరిలో నిలిచే అవకాశాలున్నాయి. తెలంగాణ జెఏసీ నేత కోదండ రాం సహాయంతో ఓ ప్రధాన పార్టీ ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. దీంతో కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌ల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని బావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో సరికొత్త రీతిలో  తన సొంత సర్వేలో 2019 ఎన్నిƒ ల్లో 106 సీట్లు సాధిస్తుందని చెప్పడం వెనుక కేసీఆర్‌ ఆంతర్యం అర్థమౌతోంది. తెరాసకు మహాకూటమికి మధ్య ఎన్నికల పోటీ ఉంటుందని ఊహించుకుంటున్నట్లు తెలియకనే తెలుస్తోంది. అయితే అనూహ్యం సరి కొత్త ఎజెండాతో  2019 ఎన్నికల్లో బిజెపి  తెలంగాణలో ఎవరూ ఊహించని రీతిలో సీట్లు కైవసం చేసుకునే యత్నాలు సాగిస్తోంది. గత 15 సంవత్సరాలుగా యూపీలో ఉనికిసైతం లేని బిజెపి ఒక్కసారిగా అత్యధిక సీట్లు సాధించిన విషయం విదితమే. వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి వస్తుందని చంద్రబాబు కలలకు, 2019లో విజయం మాదేనన్న తెరాస ధీమాకు బిజెపి చెక్‌ పెట్టేందుకు ఒంటరిపోరుకు సిద్ధమౌతోందని చెప్పకతప్పదు. ఈక్రమంలో తెలంగాణలో 95శాతం ఉన్న బడుగులను ఏకం చేయడం, ఆపై ఆయా వర్గాల నేతలకు రాజ్యాధికారం కల్పించడంలో బిజెపి కసరత్తు ప్రారంభించింది.   ముఖ్యంగా ఆంధప్రదేశ్‌లో కేసులతో సతమతమౌతున్న నేతలకు బిజెపి శరణమా? మరణమా? అంటూ కీలక రాజకీయాలకు బిజెపి వ్యూహాలు రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కుల రాజకీయాలకు కళ్లెం వేసి రాజ్యాధికారం చేజిక్కించుకునేందుకు బిజెపి సరికొత్త ఎత్తులకు శ్రీకారం చుట్టునుందన్నది సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com