ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐడియా కస్టమర్ల భద్రత కోసం ప్రైవేట్ రీచార్జ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 09:50 AM

మొబైల్ నంబర్ అవసరం లేకుండానే రీచార్జ్ చేసుకునే సదుపాయాన్ని  ‘ప్రైవేట్ రీచార్జ్’ పేరుతో ఐడియా సెల్యులర్ ఈ సర్వీసును ఉచితంగానే వినియోగదారులకు అందిస్తోంది. ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను రిటైలర్‌కు చెప్పకుండానే రీచార్జ్ చేసుకోవచ్చు. ఐడియా  తమ కస్టమర్ల మరింత భద్రతతో కూడిన సేవలు అందించడానికి ఈ సర్వీసును ప్రవేశపెట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ సర్వీసును గతేడాది ఆగస్టులో మొదటిసారిగా కేరళలో ప్రారంభించింది. అక్కడ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా 14 సర్కిళ్లలో నేటి నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ సర్వీసును పొందడానికి ఐడియా కస్టమర్లు ‘కోడ్’ అని టైప్ చేసి 55515 టోల్ ఫ్రీ నంబర్‌కి ఎస్ఎంఎస్ చేయాలి. వెంటనే మీకు వన్‌టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. మీ మొబైల్ నంబర్‌కి బదులు ఈ ఓటీపీని రిటైలర్‌కు చెప్పి మీ ఫోన్ రీచార్జ్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com