ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడికొండ నియోజకవర్గ హౌసింగ్ డి ఈ గా సీతారామయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2023, 12:48 PM

తాడికొండ నియోజకవర్గ హౌసింగ్ డి ఈ గా డి. సీతారామయ్య గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన తాడికొండ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. సీతారామయ్య శ్రీకాకుళం నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇళ్లకు సంబంధించి బిల్లులను వెంటనే విడుదల అయ్యేలా చూడాలన్నారు. కత్తెర సురేష్ ను కలిసిన వారిలో హౌసింగ్ ఏ. ఈ ఓబుల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com