ఆంధ్రప్రదేశ్ శాసనసభా చరిత్రలో ఇవాళ బ్లాక్‌డే అని మంత్రులు, వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సోమవారం శాసనసభ లో టీడీపీ నేతలు సభ సజావుగా సాగకుండా అడ్డతగిలి.. స్పీకర్ పోడియం వద్ద అనుచితంగా ప్రవర్తించారన్నారు. టీడీపీ నేతలు పేపర్లు చించి స్పీకర్‌పైకి విసరడంతో పాటు ప్లకార్డ్‌ను ఆయనకు అడ్డుగు పెట్టిన సభలో గందరగోళ పరిస్థితికి దారి తీశారు. స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వెళ్లకుండా వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మోహరించగా, ఈ క్రమంలో అధికార పార్టీ సభ్యులపై టీడీపీ నేతల దాడికి దిగారు. దళిత ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబుపై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారు అని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే లు ఆగ్రహం వ్యక్త పరిచారు. ఈ ఘటనను మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ఖండించారు.