ఒకరి భుజం మీద తుపాకీ పెట్టి మరొకరిని కాల్చడం చంద్రబాబు నైజమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాజ్యాంగ మీద ప్రమాణం చేసి మరీ ఆ స్ఫూర్తికి విరుద్ధంగా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి ఏడ్చి వెళ్లిపోయి.. బయట ఉండి అమాయకుడైన టీడీపీ దళిత శాసనసభ్యుడిని అడ్డంపెట్టి స్పీకర్‌పైనే దాడికి పురిగొల్పాడని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, వైయస్‌ఆర్ సీపీ దళిత శాసనసభ్యుడు సుధాకర్‌బాబుపై శాసనసభలో టీడీపీ సభ్యులు చేసిన దాడిని మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు.