ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రీమియమ్ రేంజ్‌లో స్మార్ట్ టీవీ సిరీస్ భారత్‌లో లాంచ్

business |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 12:38 PM

టీవీలలో సోని కంపెనీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. అలాంటి సోని కంపెనీ సోనీ బ్రావియా ఎక్స్80కే ప్రీమియమ్ రేంజ్‌లో స్మార్ట్ టీవీ సిరీస్ భారత్‌లో లాంచ్ చేసింది. సోనీ  నుంచి ప్రీమియమ్ రేంజ్‌లో స్మార్ట్ టీవీ సిరీస్ భారత్‌లో లాంచ్ అయింది. సోనీ బ్రావియా ఎక్స్80కే సిరీస్‌లో ఐదు డిస్‌ప్లే ఆప్షన్ల‌లతో స్మార్ట్ టీవీలు భారత మార్కెట్‌లోకి వచ్చాయి. 43 ఇంచులు, 50 ఇంచులు, 55 ఇంచులు, 65 ఇంచులు, 75 ఇంచుల డిస్‌ప్లే మోడళ్లు విడుదలయ్యాయి. హెచ్డీఆర్10, హెచ్ జీ ఎల్ తో పాటు డాల్బీ విజన్‌కు ఈ డిస్‌ప్లేలు సపోర్ట్ చేస్తాయి. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌లతో పాటు క్రోమ్‌కాస్ట్, యాపిల్ ఎయిర్‌ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. సోనీ బ్రావియా ఎక్స్80కే టీవీల ధరలు స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే.


4కె రెజల్యూషన్ (3840x2160 పిక్సెల్స్)తో కూడిన ఐదు స్క్రీన్ సైజ్‌ల్లో సోనీ బ్రావియా ఎక్స్80కే స్మార్ట్ టీవీలు వస్తున్నాయి. హెచ్‌డీఆర్10, హెచ్‌జీఎల్, డాల్బీ విజన్‌కు ఈ డిస్‌ప్లేలు సపోర్ట్ చేస్తాయి. అలాగే స్క్రీన్‌పై కలర్స్ మరింత అత్యుత్తమంగా ఉండేలా ట్రిలుమినోస్ డిస్‌ప్లేలను ఇస్తున్నట్టు సోనీ పేర్కొంది.


సోనీ 4కే హెచ్‌డీఆర్ ప్రాసెసర్‌ ఎక్స్1పై ఈ స్మార్ట్ టీవీలు రన్ అవుతాయి. వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగ్గా ఉండేలా పిక్చర్ ఆప్టిమైజేషన్ ఉంటుందని సోనీ చెబుతోంది. ఇక ఈ టీవీల్లో 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ టీవీ ఆధారిత గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో Sony Bravia X80K టీవీలు వస్తున్నాయి. దీంతో గూగుల్ ప్లే ద్వారా యాప్స్, గేమ్స్‌ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.


డాల్బీ ఆడియో, డాల్బీ అట్మోస్, డీటీఎస్ డిజిటల్ సరౌండ్, అకోస్టిక్ ఆటో క్యాలిబిరేషన్ సపోర్ట్ ఉన్న 10 డబ్ల్యూ సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లను సోనీ బ్రావియా ఎక్స్80కే సిరీస్ స్మార్ట్ టీవీ కలిగి ఉన్నాయి. గేమింగ్ కోసం ప్రత్యేకమైన లో ల్యాటెన్సీ మోడ్ కూడా ఉంటుంది.


డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, నాలుగు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఓ ఆడియో జాక్‌.. ఈ టీవీల కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీలతో పాటు వచ్చే రిమోట్‌ వాయిస్ కమాండ్స్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.


సోనీ బ్రావియా ఎక్స్80కే 55 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ.94,900గా ఉంది. అయితే 43 ఇంచులు, 50 ఇంచులు, 65 ఇంచులు, 75 ఇంచుల మోడల్స్ ధరను సోనీ ఇంకా వెల్లడించలేదు. 55 ఇంచుల మోడల్ ఇప్పటికే సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. మిగిలిన మోడల్స్ అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. సోనీ సెంటర్లు, ప్రధాన ఎలక్ట్రానిక్స్ స్టోర్లతో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ సోనీ బ్రావియా ఎక్స్80కే  టీవీలను కొనుగోలు చేయవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com