ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలంలో అక్టోబర్ 7 నుంచి దసరా మహోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 20, 2021, 07:37 PM

శ్రీశైలంలో దసరా మహోత్సవాల నిర్వహణపై ఈవో లవన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా ఈ సంవత్సరం కూడా శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేస్తున్నామని ఆయన చెప్పారు. శ్రీశైలంలో అక్టోబర్ 7 నుండి 15 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి తెలిపారు. వివిధ అలంకరాలలో భక్తులకు శ్రీశైల భ్రమరాంబికా అమ్మవారు దర్శనమిస్తారు. దసరా మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి అక్టోబర్ 14 న పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. గ్రామోత్సవం రద్దు దృష్ట్యా స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణ నిర్వహిస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com