ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ జాగ్రత్తలతోనే మహిళలకు భద్రత

national |  Suryaa Desk  | Published : Mon, Sep 20, 2021, 03:41 PM

పల్లెల నుంచి పట్టణాల వరకూ మహిళలపై దాడులు పెరిగిపోయాయి. వీధుల్లో, ఇళ్లల్లో కూడా రక్షణ కరువైంది. అడుగడుగునా అభ్రదతతో అమ్మాయిలు జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితి మారాలంటే.. సమాజపు మూలాల్లో మార్పు రావాలి. దీంతోపాటు అమ్మాయిలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. ఎటువంటి ప్రమాదాల్లో చిక్కుకునే చాన్స్ ఉండదు.


దీనికోసం అమ్మాయిలు కరాటే, బాక్సింగ్ వంటి వాటిలో శిక్షణ తీసుకోవాలి. ఆత్మ రక్షణ కోసం ఆడపిల్లలకు తల్లీదండ్రులు కచ్చితంగా ఇలాంటి యుద్ధ విద్యలు నేర్పించాలి. దేశంలోని యువతుల్లో నెలకొన్న భయాందోళనలు ఎక్కువవుతున్న నేపథ్యంలోనే వారికి అండగా కొన్ని పరికరాలు ఉపయోగించుకోవచ్చు.


మన దేశంలోనూ ఆత్మరక్షణ పరికరాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అందులో పెప్పర్ స్ప్రే ఒకటి. బాష్పవాయువు, మిరియాల పొడితో రూపొందిన ఈ పరికరం ఆగంతకులు దాడి చేయడానికి వచ్చినప్పుడు ప్రయోగిస్తే.. అందులోంచి వెలువడే పొగతో విపరీతమైన దగ్గు వస్తుంది. కళ్లు మండుతాయి. దీని వల్ల కొన్ని నిమిషాల పాటు ఆగంతుకుడి నుంచి ఎలాంటి ప్రతి చర్యలు ఎదురు కావు. ఈ పెప్పర్ స్ప్రే షాపుల్లో అందుబాటులో ఉన్నాయి.


అమ్మాయిలు ఏదైన ప్రమాదంలో పడినప్పుడు స్టన్‌గన్ అలారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అతి శక్తిమంతమైన వెలుగును విరజిమ్మే ఫ్లాష్‌లైట్‌తో రూపొందిన ఈ పరికరాన్ని వినియోగిస్తే.. చీకట్లో ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది. పైగా 13 డెసిబుల్స్‌లో శబ్దం చేస్తూ అలారం మోగుతుంది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్లు అక్కడకు వస్తారు. వీటితో పాటు స్టన్ పెన్, రబ్బర్, స్టీల్ కర్ర, స్టన్ గన్ పరికరాలను ఆత్మ రక్షణ కోసం మహిళలు ఉపయోగించుకోవచ్చు. వీటి ధర రూ.1000ల నుంచి రూ.3,500ల వరకూ ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com