ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియన్‌ నేవీలో 230 జాబ్స్‌

national |  Suryaa Desk  | Published : Wed, Sep 08, 2021, 04:47 PM

ఇతర వివరాలు: ఇండియన్ నేవీ పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కొచ్చిలోని నేవల్ షిప్‌యార్డ్‌లో ఉన్న అప్రెంటీస్ ట్రైనింగ్ స్కూల్‌లో 230 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెకానిక్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులు చేసుకోవడానికి 2021 అక్టోబర్ 1 చివరి తేదీ. అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి.


మొత్తం ఖాళీలు: 230


విద్యార్హతలు: మెట్రిక్యులేషన్ లేదా టెన్త్ క్లాస్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో 65 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


వయస్సు: 21 ఏళ్ల లోపు ఉండాలి.


ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్ లేదా టెన్త్ క్లాస్‌లో, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఉన్న దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.


దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 1, 2021


దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:


The Admiral Superintendent (for Officer-in-Charge),


Apprentices Training School,


Naval Ship Repair Yard,


Naval Base, Kochi – 682004.


వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com