కొవిడ్ వ్యాక్సిన్ స్లాట్ ను వాట్సాప్ ద్వారా బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ ద్వారా చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
-ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో 9013151515 నెంబర్ సేవ్ చేసుకోండి (నెంబర్ సేవ్ చేసుకోకుండానే హెల్ప్ లైన్ డెస్క్ లోకి వెళ్లడానికి ఈ లింక్ క్లిక్ చేయండి wa.me/919013151515)
-ఈ నెంబర్ కు వాట్సాప్ లో Book Slot అని టైప్ చేసి మెసెజ్ పంపాలి
-మీకు ఆరు అంకెల ఓటీపీ నెంబర్ వస్తుంది
-మూడు నిమిషాల్లోగా ఓటీపీ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
-ఆ నెంబర్ ఆధారంగా ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలను బట్టి మనకు వివిధ ఆప్షన్లు వస్తాయి.
-అక్కడ చూపించే ఆప్షన్ల వారీగా 1,2,3, ఇలా 8 వరకు నెంబర్లు కేటాయించారు.
-మన అవసరానికి తగ్గట్టుగా ఆప్షన్లు ఎంచుకోవాలి
- ఈ హెల్ప్‌లైన్ డెస్క్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు కరోనాకు సంబంధించి ఇతర సమాచారాన్ని కూడా తెలుసుకునే వీలుంది