శరీరంలో మెదడు సున్నితమైన అవయవం. అయితే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగా ఉంటే శరీరమంతా విపరీత ప్రభావం ఉండటంతో పాటు ఆ తీవ్రత మెదడుపై కూడా పడుతుందంటున్నారు నిపుణులు. గ్లూకోజ్ మోతాదు పెరిగితే మెదడుపై దుష్ప్రభావం చూపుతుందని, విషయ గ్రహణ సామర్థ్యం క్షీణించే ప్రమాదంతో పాటు ఏకాగ్రత లోపించవచ్చంటున్నారు. గ్లూకోజ్ కు డిప్రెషన్ కు సంబంధం ఉందని ఓ అధ్యయనంలో తేలినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పొట్టు తీయని ధాన్యాలు తినడం ద్వారా మెదడును కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.