ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులకు ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 11, 2021, 01:13 PM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లకు బయో మెట్రిక్‌ హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయో మెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేస్తూ.. వేతనాల చెల్లింపుతో అనుసంధానం చేస్తూ గతంలో ఆదేశాలిచ్చారు. గ్రామ, వార్డు వాలంటీర్లు కూడా బయోమెట్రిక్‌ హాజరు వేయాలని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయో మెట్రిక్‌ హాజరుతో జీతాల అనుసంధానాన్ని నిలుపుదల చేస్తున్నామని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని భరత్‌ గుప్త పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com